అందుకే చంద్రబాబును కలిసేందుకు వెళ్లలేదు

ABN , First Publish Date - 2023-09-18T01:57:01+05:30 IST

రాజమహేంద్రవరం జైలులో వున్న టీడీపీ అధినేత, తన మిత్రుడు చంద్రబాబును చూసేందుకు వెళ్లాల్సివున్నా, ఇంట్లో ఓ కార్యక్రమం ఉండడంతో కుదరలేదని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలిపారు...

అందుకే చంద్రబాబును కలిసేందుకు వెళ్లలేదు

ఇంట్లో కార్యక్రమం వల్ల

వెళ్లలేకపోయానన్న రజనీకాంత్‌

చెన్నై, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం జైలులో వున్న టీడీపీ అధినేత, తన మిత్రుడు చంద్రబాబును చూసేందుకు వెళ్లాల్సివున్నా, ఇంట్లో ఓ కార్యక్రమం ఉండడంతో కుదరలేదని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలిపారు. తన కుటుంబ కార్యక్రమం కోసం ఆదివారం కోయంబత్తూరు వెళ్లిన రజనీకాంత్‌.. మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘అవును! నా మిత్రుడు చంద్రబాబును చూసేందుకు రాజమహేంద్రవరం వెళ్లాల్సి ఉంది. అయితే ఇంట్లో ఓ కార్యక్రమం ఉండడంతో కుదరలేదు’ అని చెప్పారు. చంద్రబాబు అరెస్టును రజనీకాంత్‌ తీవ్రంగా ఖండించడంతో పాటు ‘నా మిత్రుడు ఎలాంటి తప్పు చేయడు’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-18T01:57:01+05:30 IST