డీఆర్‌డీవో ఎంఎ్‌సఎస్‌ డీజీగా రాజబాబు

ABN , First Publish Date - 2023-06-01T01:16:39+05:30 IST

డీఆర్‌డీవో క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్ధల(ఎంఎ్‌సఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజబాబు నియమితులయ్యారు....

డీఆర్‌డీవో ఎంఎ్‌సఎస్‌ డీజీగా రాజబాబు

హైదరాబాద్‌, అల్వాల్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): డీఆర్‌డీవో క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్ధల(ఎంఎ్‌సఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజబాబు నియమితులయ్యారు. డీఆర్‌డీఓ ఎంఎ్‌సఎస్‌ డీజీగా ఉన్న బీహెచ్‌వీఎ్‌స నారాయణ మూర్తి బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో డీఆర్‌డీఓ ఆర్‌సీఐ విభాగం డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజబాబును ఆ స్థానంలో నియమించారు. ఈయన గురువారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసి 1988లో వైమానిక దళంలో తన కెరీర్‌ ప్రారంభించిన రాజబాబు 1995లో డీఆర్‌డీ వోలో చేరారు. 35 ఏళ్ల ప్రొఫెషనల్‌ ఏరోస్పెస్‌ కెరీర్‌లో విమానాలు, హెలికాప్టర్లు, అనేక క్షిపణి వ్యవస్థల అభివృద్ధిపై పనిచేశారు. ఆయన నాయకత్వంలో దేశంలోనే మొట్టమొదటి ఉపగ్రహ క్షిపణి పరీక్ష (ఎ-శాట్‌) మిషన్‌ శక్తిని విజయవంతం చేశారు. మిషన్‌ శక్తి ప్రదర్శనను విజయవంతంగా నడిపించినందుకు అత్యుత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డును రాజబాబుకు ప్రదానం చేశారు.

Updated Date - 2023-06-01T01:16:39+05:30 IST