రాహుల్‌ గాంధీ అనర్హతపై భగ్గుమన్న కాంగ్రెస్‌ శ్రేణులు

ABN , First Publish Date - 2023-03-26T00:51:14+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. రాహుల్‌కి పెరుగుతున్న పాపులారిటీతో భయపడే బీజేపీ ఆగమేఘాలమీద ఆయనపై అనర్హత వేటు ..

రాహుల్‌ గాంధీ అనర్హతపై  భగ్గుమన్న కాంగ్రెస్‌ శ్రేణులు

న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. రాహుల్‌కి పెరుగుతున్న పాపులారిటీతో భయపడే బీజేపీ ఆగమేఘాలమీద ఆయనపై అనర్హత వేటు వేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఢిల్లీలో ఏఐసీసీ నేతలు రాహుల్‌గాంధీ మాస్కులను ధరించి, మౌనదీక్ష చేపట్టారు. ‘‘భయపడొద్దు.. నిజమైన గాంధీ సత్యం కోసం పోరాడుతాడు’’అని ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. వయనాడ్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ‘బ్లాక్‌డే’, సత్యాగ్రహ దీక్ష పాటించాయి. వయనాడ్‌, హైదరాబాద్‌, రాంచీల్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. చండీగఢ్‌లో యూత్‌కాంగ్రె్‌స కార్యకర్తలు పట్టాలపై బైఠాయిం చి శతాబ్దిఎక్స్‌ప్రె్‌సను నిలిపివేశారు. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాదీ కూటమి అసెంబ్లీ ఎదుట నోటికి నల్లరిబ్బన్లతో ఆందోళన చేపట్టింది.దాదాపు అన్ని రాష్ట్రాల జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు ‘బ్లాక్‌డే’ పేరుతోఆందోళనలు చేపట్టాయి.

నేటి నుంచి సంకల్ప్‌ సత్యాగ్రహ

రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా దేశవ్యాప్తంగా ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ పేరుతో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్‌ అధిష్ఠా నం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదివారం అన్ని రాష్ట్ర రాజధానుల్లోని గాంధీ విగ్రహాల ముందు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది.

Updated Date - 2023-03-26T00:51:14+05:30 IST