ఇది ‘మిత్ర్‌ కాల్‌’ బడ్జెట్‌: రాహుల్‌

ABN , First Publish Date - 2023-02-02T03:09:45+05:30 IST

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘మిత్ర్‌ కాల్‌’ (మిత్రులకు అనుకూలమైన) బడ్జెట్‌గా

ఇది ‘మిత్ర్‌ కాల్‌’ బడ్జెట్‌: రాహుల్‌

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘మిత్ర్‌ కాల్‌’ (మిత్రులకు అనుకూలమైన) బడ్జెట్‌గా అభివర్ణించారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగాలు సృష్టించే విజన్‌ కానీ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రణాళిక కానీ లేదని విమర్శించారు. భారత్‌ భవిష్యత్‌ను నిర్మించే రోడ్‌ మ్యాప్‌ కేంద్రానికి లేదని స్పష్టమైందన్నారు. ‘ఈ మిత్ర్‌ కాల్‌ బడ్జెట్‌లో ఉద్యోగాలు సృష్టించే విజన్‌ లేదు. అసమానతలను తొలగించే ఉద్దేశం లేదు’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-02-02T03:09:46+05:30 IST