పూర్ణేశ్‌ ఇంటి పేరు మోదీ కాదు..

ABN , First Publish Date - 2023-03-26T01:00:50+05:30 IST

‘దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరే ఎందుకుంటుంది!?’ అంటూ వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై కేసు వేసి ఆయనకు శిక్ష పడేందుకు.. తద్వారా లోక్‌సభ సభ్య త్వం రద్దుకూ ..

పూర్ణేశ్‌ ఇంటి పేరు మోదీ కాదు..

న్యూఢిల్లీ, మార్చి25: ‘దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరే ఎందుకుంటుంది!?’ అంటూ వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై కేసు వేసి ఆయనకు శిక్ష పడేందుకు.. తద్వారా లోక్‌సభ సభ్య త్వం రద్దుకూ కారణమైన వ్యక్తి ‘పూర్ణేష్‌ మోదీ’. గుజరాత్‌లోని సూరత్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మె ల్యే ఈయన. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా పూర్ణేష్‌ ఇంటి పేరు ‘మోదీ’ కాదు...‘భూత్‌వాలా’. ఈ మేర కు పాఠశాల ధ్రువపత్రంలోనూ ఉంది. సామాజికవర్గం మాత్రం ‘మోదీ ఘాంచీ’. తమ పూర్వీకులు సూరత్‌లోని ‘భూత్‌సేరీ’ ప్రాంతంలో నివసించేవారని, అలా ఇంటిపేరు భూత్‌వాలాగా వచ్చిందని పూర్ణేశ్‌ తెలిపారు. కాగా సూరత్‌ కోర్టులో వాదనల సందర్భంగా రాహుల్‌ లాయర్‌.. పూర్ణేశ్‌ ఇంటిపేరు గురించి ప్రశ్నించారు. దీంతో 1988లో తన పేరు పక్కన మోదీ అని చేర్చుకున్నట్లు తెలిపారు. పాఠశాల ధ్రువపత్రాలనూ చూపా రు. గుజరాత్‌ మోదీ సమాజ్‌కు పూర్ణేష్‌ మోదీ ఆఫీస్‌ బేరర్‌. రాహుల్‌ వ్యాఖ్యల అనంతరం కేసు వేశామని.. ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని తెలిపారు. ఈ పరిణామాలతో తాను గెలిచినట్లుగానో, వేరొకరు ఓడినట్లుగానో భావించడం లేదని, ఇది కేవలం దేశ సామాజిక కూర్పునకు సంబంధించిన విషయమన్నారు. కాగా, పూర్ణేశ్‌ పూర్తి పేరు పూర్ణేశ్‌ ఈశ్వరీలాల్‌ మోదీ. 2012 చివర్లో తొలిసారిగా సూరత్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2017, 2022లోనూ విజయం సాధించారు. గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో 1.04 లక్షల ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు. 2021లో భూపేంద్ర పటేల్‌ మంత్రివర్గంలో పూర్ణేశ్‌కు చోటుదక్కింది.

Updated Date - 2023-03-26T01:00:50+05:30 IST