A R Rahman: ఏ ఆర్ రెహమాన్‌కు షాకిచ్చిన పూణె పోలీసులు

ABN , First Publish Date - 2023-05-01T15:20:23+05:30 IST

సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్‌కు (A R Rahman) పూణె పోలీసులు (Pune police) షాకిచ్చారు.

A R Rahman: ఏ ఆర్ రెహమాన్‌కు షాకిచ్చిన పూణె పోలీసులు
Pune police gives shock to AR Rahman

పూణె: సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్‌కు (A R Rahman) పూణె పోలీసులు (Pune police) షాకిచ్చారు. సమయం మించి పోయినా ఇంకా కన్సెర్ట్ (Music Concert) కొనసాగిస్తుండటంతో పోలీసులు స్టేజీపైకి ఎక్కారు. రాత్రి పది అయిందని, షో ను ఆపేయాలని సూచించారు. ఆ సమయంలో రెహమాన్ పాట పాడుతున్నారు. పాట పాడుతుండగానే పోలీసులు అడ్డుకున్నారు. మ్యూజిక్ బ్యాండ్ సభ్యులను కూడా ఆపేయాలని సూచించారు. దీంతో రెహమాన్ టీమ్‌ తమ కన్సెర్ట్‌ను ముగించాల్సి వచ్చింది.

అంతకుముందు రెహమాన్‌ మ్యూజికల్ కన్సెర్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు తరలివచ్చారు. రెహమాన్ టీమ్ తమ పాటలతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.

కన్సెర్ట్‌ను విజయవంతం చేసినందుకు రెహమాన్ పూణె అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ట్వీట్‌లో కన్సెర్ట్ ఫొటోలు కూడా జత చేశారు.

Updated Date - 2023-05-01T16:14:14+05:30 IST