జోడో 2.0లో రాహుల్‌తో ప్రియాంక!
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:49 AM
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర 2.0లో ఆయన సోదరి ప్రియాంక కూడా పాల్గొనే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. జనవరిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈసారి దేశ తూర్పు
న్యూఢిల్లీ, డిసెంబరు 25: రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర 2.0లో ఆయన సోదరి ప్రియాంక కూడా పాల్గొనే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. జనవరిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈసారి దేశ తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతానికి సాగుతుంది. ‘ప్రియాంక, రాహుల్ కలిసి యాత్ర నిర్వహించే అంశాన్ని క్షుణ్ణంగా చర్చించాం. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని కాంగ్రెస్ కీలక నేత ఒకరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఇరువురినీ రెండు భిన్న కోణాల్లో చూస్తోంది. రాహుల్ అన్ని వర్గాల్లోకి చొచ్చుకువెళ్లగలిగే నేతగా పేర్కొంటున్న పార్టీ, ప్రియాంకను...మహిళలు, యువత, గ్రామీణ వాసులను విశేషంగా ఆకట్టుకునే సామర్థ్యం ఉన్న నేతగా పరిగణిస్తోంది.