Share News

Priyanka Gandhi : ఈడీ చార్జిషీటులో ప్రియాంక

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:22 AM

నగదు అక్రమ చలామణీ అభియోగాలతో ఆయుఽధ దళారీ సంజయ్‌ భండారీపై నమోదు చేసిన చార్జిషీట్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకగాంధీ పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలిసారిగా ప్రస్తావించింది. ఇదే చార్జిషీటులో ప్రియాంక భర్త రాబర్ట్‌

 Priyanka Gandhi  : ఈడీ చార్జిషీటులో ప్రియాంక

హరియాణాలో 5 ఎకరాల క్రయవిక్రయం

కేసులో తొలిసారి కాంగ్రెస్‌ నేత పేరు

భర్త వాద్రా పేరూ.. నిందితులుగా కాదు!

ప్రవాస వ్యాపారి సీసీ థంపి, భారత

సంతతి బ్రిటిషర్‌ సుమిత్‌పై చార్జిషీట్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నగదు అక్రమ చలామణీ అభియోగాలతో ఆయుఽధ దళారీ సంజయ్‌ భండారీపై నమోదు చేసిన చార్జిషీట్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకగాంధీ పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలిసారిగా ప్రస్తావించింది. ఇదే చార్జిషీటులో ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా పేరునూ గతంలో పే ర్కొంది. అయితే, వీరిద్దరినీ నిందితులుగా ప్రస్తావించలేదు. చార్జిషీట్‌ ప్రకారం.. ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ ద్వారా 2006లో హరియాణలోని ఫరీదాబాద్‌లో ఐదెకరాల భూమిని ప్రియాంక కొనుగోలు చేశారు. 2010లో తిరిగి అదే ఏజెంట్‌కు విక్రయించారు. ఈ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు విదేశాల ద్వారా అక్రమంగా జరిగాయి. మనీలాండరింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటూ.. పరారీలో ఉన్న సంజయ్‌ భండారీ స్నేహితుడు, ప్రవాస వ్యాపారి చెరువత్తూర్‌ చకుట్టి (సీసీ) థంపి ఈ వ్యవహారంలో ప్రియాంక కుటుంబానికి సహకరించారు. థంపికి వాద్రాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రియాంక నుంచి భూమిని తిరిగి కొన్న ఢిల్లీ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ కొంత భాగాన్ని థంపికి అమ్మాడు. ఈ లావాదేవీలు వాద్రా, థంపి మధ్య భాగస్వామ్యం, వ్యాపార ప్రయోజనాలను స్పష్టం చేస్తోంది. మరోవైపు భండారీ లండన్‌లోని 12 బ్రియాన్‌స్టోన్‌ స్క్వేర్‌ అనే ఇంటిని అక్రమ సంపాదన ద్వారా పొందాడు. భారత సంతతి బ్రిటిషర్‌ సుమిత్‌ చద్దా సహకారంతో దీనికి వాద్రా మరమ్మతులు చేయించి బస కూడా చేశారు. కాగా, భండారీ 2016లో బ్రిటన్‌కు పారిపోయాడు. అతడిని అప్పగించాలని ఈడీ, సీబీఐ బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరగా.. ఈ ఏడాది జనవరిలో అందుకు అంగీకారం లభించింది. మరోవైపు ఈడీ చార్జిషీటులో ప్రియాంక పేరును చేర్చడం పట్ల కాంగ్రెస్‌ మండిపడింది. ఎన్నికల ముంగిట బీజేపీకి ఇలాంటి చర్యలు అలవాటేనని.. ఇంకెన్నీ చేస్తారో చూడాలని వ్యాఖ్యానించింది.

Updated Date - Dec 29 , 2023 | 06:22 AM