ప్రధాని మోదీ.. ఈ 9 ప్రశ్నలకు బదులివ్వండి!
ABN , First Publish Date - 2023-05-27T04:08:43+05:30 IST
కేంద్రంలో తొమ్మిది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తొమ్మిది ప్రశ్నలు సంధించింది.

న్యూఢిల్లీ, మే 26(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో తొమ్మిది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తొమ్మిది ప్రశ్నలు సంధించింది. ఆకాశాన్ని అంటుతున్న ధరలు, నిరుద్యోగం, పడిపోతున్న రైతుల ఆదాయం వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ‘నౌ సాల్–నౌ సవాల్’ పేరుతో ఒక బుక్ లెట్‌ను విడుదల చేసింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలను వంచించినందుకు మోదీ క్షమాపణ చెప్పాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మోదీపై అనేక ప్రశ్నలు సంధించారని, వాటి ఆధారంగా 9 ప్రశ్నలను రూపొందించామని తెలిపారు. ప్రధాని జవాబివ్వాలని ఆయన కోరారు.