Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్‌ బంగా

ABN , First Publish Date - 2023-02-24T01:24:32+05:30 IST

ప్రపంచబ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతి వ్యక్తి అజయ్‌ బంగా(63)ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను నామినేట్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

 Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్‌ బంగా

నామినేట్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 23: ప్రపంచబ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతి వ్యక్తి అజయ్‌ బంగా(63)ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను నామినేట్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అజయ్‌కు ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అనుభవం ఉందని అందులో స్పష్టం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ ఈ ఏడాది జూన్‌లోనే పదవి నుంచి దిగేందుకు యోచిస్తున్నట్లు ప్రకటించడంతో.. బైడెన్‌ అజయ్‌ పేరును ప్రతిపాదించారు. అజయ్‌ ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ సంస్థకు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రపంచబ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్‌ అయిన తొలి భారత సంతతి వ్యక్తి ఆయనే కావడం విశేషం. భారత్‌లోని పుణెలో జన్మించిన అజయ్‌.. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. 1996లో అమెరికాకు వలస వెళ్లి పెప్సికోలో చేరారు.

Updated Date - 2023-02-24T01:24:33+05:30 IST