Pongal gift: రైతుల నుంచి చెరకు కొనుగోలు

ABN , First Publish Date - 2023-01-01T10:33:48+05:30 IST

రైతుల నుంచి చెరకు కొనుగోళ్లను ఆహార శాఖ ప్రధాన కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ స్వయంగా పరిశీలించారు. పొంగల్‌ సందర్భంగా

Pongal gift: రైతుల నుంచి చెరకు కొనుగోలు

- పొలాల్లోకి వెళ్లి పరిశీలించిన ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణన్‌

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 31: రైతుల నుంచి చెరకు కొనుగోళ్లను ఆహార శాఖ ప్రధాన కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ స్వయంగా పరిశీలించారు. పొంగల్‌ సందర్భంగా రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు పొంగల్‌ గిఫ్ట్‌ ప్యాక్‌(Pongal Gift Pack)తో ఒక చెరకు గడ కూడా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. అందుకు చెరకు కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకండా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా అన్ని జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో అధికారుల బృందం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో, మైలాడుదురై శీర్గాళి సమీపం సెంపతనిరుప్పు గ్రామంలో రైతుల నుంచి చెరకు కొనుగోలును శనివారం ఆహార శాఖ ప్రధాన కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల నుంచి చెరకు గడ రూ.33కు కొనుగోలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.72.38 కోట్లు కేటాయించిందని తెలిపారు.

Updated Date - 2023-01-01T10:33:50+05:30 IST