కాలుష్యంతో హృదయస్పందనలో హెచ్చుతగ్గులు

ABN , First Publish Date - 2023-05-02T02:18:15+05:30 IST

దీర్ఘకాలం పాటు వాయుకాలుష్యానికి గురైనవారిలో హృదయస్పందనలో హెచ్చుతగ్గులు చోటుచేసుకునే ప్రమాదం ఉంటుందని చైనాలోని ఫుడాన్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

కాలుష్యంతో హృదయస్పందనలో హెచ్చుతగ్గులు

న్యూఢిల్లీ, మే 1: దీర్ఘకాలం పాటు వాయుకాలుష్యానికి గురైనవారిలో హృదయస్పందనలో హెచ్చుతగ్గులు చోటుచేసుకునే ప్రమాదం ఉంటుందని చైనాలోని ఫుడాన్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. దీన్ని అరిథ్‌మియాగా వ్యవహరిస్తామని, ఈ పరిస్థితి వచ్చినవారిలో గుండె లయ సక్రమంగా ఉండదని వివరించారు. ‘‘చైనాలోని 322 నగరాల్లో అరిథ్‌మియా వచ్చిన దాదాపు 1.9లక్షలమంది వైద్య సమాచారాన్ని మేం సేకరించాం. వారు వాయుకాలుష్యానికి ఎంతసేపు లోనవుతున్నారో పరిశీలించాం. కాలుష్యానికి, హృదయస్పందనకు కచ్చితంగా సంబంధం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. గుండె పదిలంగా ఉండాలంటే వాయుకాలుష్యానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం’’ అని పరిశోధకులు వెల్లడించారు.

Updated Date - 2023-05-02T02:18:15+05:30 IST