Share News

పీఎంవో అధికారా? ఆర్మీ వైద్యుడా?!

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:39 AM

కొందరికి పీఎంవో అధికారినని చెబుతాడు... మరికొందరితో ఆర్మీ వైద్యుడిగా పరిచయం చేసుకుంటాడు. పూటకో వేషం మారుస్తూ ఆరేడుగురిని పెళ్లి చేసుకున్నాడు.

పీఎంవో అధికారా? ఆర్మీ వైద్యుడా?!

ఒడిశాలో కశ్మీరీ యువకుడి అరెస్టు

భువనేశ్వర్‌, డిసెంబరు 17: కొందరికి పీఎంవో అధికారినని చెబుతాడు... మరికొందరితో ఆర్మీ వైద్యుడిగా పరిచయం చేసుకుంటాడు. పూటకో వేషం మారుస్తూ ఆరేడుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఓ కశ్మీరీ యువకుడిని ఒడిశా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అరెస్టు చేసింది. నిందితుడిని జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన సయ్యద్‌ ఇషాన్‌ బుఖారీ అలియాస్‌ ఇషాన్‌ బుఖారీగా గుర్తించారు. అరెస్టు సందర్భంగా జరిపిన తనిఖీల్లో అమెరికా, కెనడా సంస్థలు జారీచేసిన మెడికల్‌ డిగ్రీ సర్టిఫికెట్లు, ఖాళీ చెక్కులు, ఆధార్‌, విజిటింగ్‌ కార్డుల వంటి 100కు పైగా ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కశ్మీర్‌, యూపీ, మహారాష్ట్ర, ఒడిశా సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరేడుగురు మహిళలను వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేరళకు చెందిన కొందరు అనుమానాస్పద వ్యక్తులతో పాటు పాకిస్థానీ జాతీయులతో, ఐఎ్‌సఐతో ఇషాన్‌ టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

Updated Date - Dec 18 , 2023 | 06:42 AM