మరో ఎన్నికల స్టంట్‌!

ABN , First Publish Date - 2023-09-18T02:18:16+05:30 IST

పీఎం విశ్వకర్మ యోజనను మరో ఎన్నికల స్టంట్‌గా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ..

మరో ఎన్నికల స్టంట్‌!

పీఎం విశ్వకర్మపై కాంగ్రెస్‌ విమర్శలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: పీఎం విశ్వకర్మ యోజనను మరో ఎన్నికల స్టంట్‌గా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ప్రధాని మోదీ గతంలో అమలుపరిచిన నోట్లరద్దు, జీఎస్టీ, ఆకస్మిక లాక్‌డౌన్‌లతో చిన్నస్థాయి పరిశ్రమలు, సంస్థలే అత్యధికంగా నష్టపోయాయని.. వాటిని వస్త్ర, తోలు, లోహ, కలప తదితర రంగాలలో సొంతదారులే తమ శ్రమతో నడుపుతుంటారని పేర్కొంది. వారి జీవితాలను అతలాకుతలం చేసిన మోదీ ఇప్పుడు మేల్కొని, వారి అసంతృప్తిని చల్లార్చటానికి మరో ఎన్నికల స్టంట్‌ను తీసుకొచ్చారని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. విశ్వకర్మ యోజనను ప్రకటించిన మోదీ.. బీసీలు ఎంతోకాలంగా కోరుకుంటున్న కులగణన డిమాండ్‌ పట్ల మాత్రం కావాలనే నిశ్శబ్దంగా ఉన్నారని జైరాం విమర్శించారు.

Updated Date - 2023-09-18T02:18:16+05:30 IST