PM Modi : ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్

ABN , First Publish Date - 2023-01-31T11:37:20+05:30 IST

2023 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని ప్రధాని మోదీ (PM Modi) వెల్లడించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారి పార్లమెంట్‌లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారని తెలిపారు.

PM Modi : ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్

ఢిల్లీ : 2023 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని ప్రధాని మోదీ (PM Modi) వెల్లడించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారి పార్లమెంట్‌లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారని తెలిపారు. ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవమని.. అలాగే ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవమన్నారు. ఎవరైనా నూతన సభ్యుడు పార్లమెంట్ లో కొత్తగా మాట్లాడేవారిని పార్లమెంట్ ప్రోత్సహిస్తుందన్నారు. దేశ ఆర్ధిక మంత్రి కూడా మహిళ అని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం భారత్ కాదు యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానన్నారు. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్ అని మోదీ పేర్కొన్నారు. విపక్ష సభ్యులు అన్ని అంశాలపై పార్లమెంట్‌లో లేవనెత్తెందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నానన్నారు.

కాగా.. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ తొలి దఫా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 13 వరకూ తొలి దఫా సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఉభయ సభల్లో ఆర్థిక సర్వే ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం పార్లమెంటు ముందుకు కేంద్ర వార్షిక బడ్జెట్ రానుంది. బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉదయం 9 గంటలకు రాష్ట్రపతిని నిర్మల సీతారామన్ కలవనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు నిర్మలా సీతారామన్ చేరుకోనున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్‌లో జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో మంత్రి మండలి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. 11 గంటలకు లోక్‌సభలో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 2019 నుంచి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు.

Updated Date - 2023-01-31T11:37:22+05:30 IST