Share News

25 ఏళ్లు కష్టపడి.. 56 ఏళ్ల వయసులో పీజీ

ABN , First Publish Date - 2023-11-29T05:11:05+05:30 IST

చదువుకోవాలనే తపన ఉండాలనే గాని అందుకు వయసు, కుటుంబ బాధ్యతలు అడ్డురావని నిరూపించాడో ఓ వ్యక్తి. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ తన 56 ఏట గణితంలో పీజీ

25 ఏళ్లు కష్టపడి.. 56 ఏళ్ల వయసులో పీజీ

భోపాల్‌, నవంబరు 28: చదువుకోవాలనే తపన ఉండాలనే గాని అందుకు వయసు, కుటుంబ బాధ్యతలు అడ్డురావని నిరూపించాడో ఓ వ్యక్తి. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ తన 56 ఏట గణితంలో పీజీ పూర్తి చేశాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన రాజ్‌కరణ్‌ 1996లోనే పురావస్తు శాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీని పూర్తిచేశాడు. అయితే అతడికి గణితం మీద ఉన్న ఇష్టంతో అందులో పీజీ పట్టా సాధించాలని నిశ్చయించుకున్నాడు. రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తూ చదువు కొనసాగించాడు. జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి వర్సిటీలో తన 31 ఏట ఏంఎస్సీ మ్యాథ్స్‌ కోర్సులో చేరాడు. పీజీ పట్టా కోసం 25 సంవత్సరాలుగా పోరాడుతూ 23వ ప్రయత్నంలో కలను సాకారం చేసుకున్నాడు.

Updated Date - 2023-11-29T06:54:23+05:30 IST