ఢిల్లీలో పట్టపగలే న్యాయవాది హత్య

ABN , First Publish Date - 2023-04-03T01:30:35+05:30 IST

ఢిల్లీలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ న్యాయవాది హత్య జరిగింది. ద్వారకా ప్రాంతంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. దాంతో ఢిల్లీలోని న్యాయవాదులంతా సోమవారం విధులకు దూరంగా

ఢిల్లీలో పట్టపగలే న్యాయవాది హత్య

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ఢిల్లీలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ న్యాయవాది హత్య జరిగింది. ద్వారకా ప్రాంతంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. దాంతో ఢిల్లీలోని న్యాయవాదులంతా సోమవారం విధులకు దూరంగా ఉండి నిరసన తెలుపనున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నరేశ్‌, ప్రదీప్‌ అనే వ్యక్తులు బైక్‌పై వచ్చి న్యాయవాది వీరేందర్‌ కుమార్‌ నర్వాల్‌ను కాల్చి చంపారు. నిందితుడు ప్రదీ్‌పకు వీరేందర్‌తో 36 ఏళ్ల నుంచి శత్రుత్వం ఉంది. వీరేందర్‌ను చంపేందుకు 2017లో ప్రయత్నం చేశాడు. ఆ ఘటనతో వీరేందర్‌కు పోలీసులు రక్షణ కల్పించారు. కానీ కొవిడ్‌ సమయంలో ఆ రక్షణను తొలగించారు. వీరేందర్‌ హత్యను న్యాయవాదులంతా ఖండించారు.

Updated Date - 2023-04-03T01:30:35+05:30 IST