Ananth Technologies : అనంత్‌ టెక్నాలజీస్‌కు భాగస్వామ్యం

ABN , First Publish Date - 2023-08-24T03:30:14+05:30 IST

చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంపై హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇది..

Ananth Technologies : అనంత్‌ టెక్నాలజీస్‌కు భాగస్వామ్యం

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంపై హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇది.. ఇస్రో శాస్త్రవేత్తల బృందం అంకితభావం, కృషి, నైపుణ్యానికి దక్కిన విజయమని అభినందించింది. ఈ మిషన్‌కు పలు పరికరాలను సమకూర్చే అవకాశాన్ని ఏటీఎల్‌కు ఇస్రో కల్పించిందంటూ ఆ సంస్థ సీఎండీ సుబ్బారావు పావులూరి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్‌-3 మిషన్‌కు టెలిమెట్రీ, టెలికమాండ్‌ సిస్టమ్స్‌తోపాటు పవర్‌ మేనేజ్‌మెంట్‌, డీసీ-డీసీ కన్వర్టర్లను ఏటీఎల్‌ అందించిందన్నారు. అన్నింటి కన్నా ముఖ్యంగా పవర్‌ స్విచ్చింగ్‌ మాడ్యూల్స్‌ను, ఎస్‌ఎల్‌ఆర్‌యూ-బీఎస్‌, ఎస్‌సీవోయూటీ-ఏ వంటి ఇంటర్‌ఫేస్‌ ప్యాకేజీలను అందించిందని వెల్లడించారు. అంకితభావం కలిగిన ఏరోస్పేస్‌ సంస్థగా అంతరిక్ష రంగంలో భారత్‌ సాధించబోయే మరిన్ని విజయాల్లో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-24T03:30:14+05:30 IST