Ooty: ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ
ABN , First Publish Date - 2023-01-17T07:44:38+05:30 IST
నీలగిరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీ(Ooty)లో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. పొంగల్ సందర్భంగా వరుస సెలవు దినాలు
చెన్నై, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): నీలగిరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీ(Ooty)లో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. పొంగల్ సందర్భంగా వరుస సెలవు దినాలు రావటంతో శుక్రవారం నుంచే ఊటీలో సందర్శకుల రద్దీ పెరిగింది. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఊటీ బొటానికల్ పార్కు, అక్కడి ఫ్లవర్‌షోలను పర్యాటకులు తిలకించారు. పడవలో తిరిగేందుకు పోటీపడ్డారు. కున్నూరు సిమ్స్ పార్కు, కొత్తగిరి నెహ్రూ పార్కు, ముదుమలై పులుల అభయారణ్యం తదితర ప్రాంతాల్లోనూ సందర్శకుల తాకిడి అధికమైంది.