Share News

మరో పార్టీలోకి వెళ్లేందుకు పిచ్చోడిని కాదు!

ABN , Publish Date - Dec 14 , 2023 | 05:18 AM

‘నేను పుట్టుకతో కాంగ్రెస్‌ వాదిని. మరో పార్టీలోకి వెళ్లేందుకు నేనేమీ పిచ్చోడిని కాదు’ అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌

మరో పార్టీలోకి వెళ్లేందుకు పిచ్చోడిని కాదు!

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

బెంగళూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘నేను పుట్టుకతో కాంగ్రెస్‌ వాదిని. మరో పార్టీలోకి వెళ్లేందుకు నేనేమీ పిచ్చోడిని కాదు’ అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తేల్చిచెప్పారు. అధికార పార్టీలో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓ ప్రముఖ నేత 50-60 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో వెళ్లేందుకు సిద్ధమయ్యారని ఇటీవల జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఆ ప్రముఖ నేత ఢిల్లీలో బీజేపీ నేతతో చర్చించారని కూడా అన్నారు. దీనిపై డీకే తీవ్రంగా స్పందించారు. జీవితకాలం కాంగ్రెస్‌ వాదినని, తానెందుకు పార్టీ మారుతానని ప్రశ్నించారు

Updated Date - Dec 14 , 2023 | 05:18 AM