Share News

ఆ ‘మాటలు’ ఇకవద్దు

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:57 AM

అంగవైకల్యం సంబంధించిన మాటలను రాజకీయ ప్రసంగాల్లో వాడరాదని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను కోరింది.

ఆ ‘మాటలు’ ఇకవద్దు

రాజకీయ ప్రసంగాల్లో అంగవైకల్యానికి

సంబంధించిన పదాలు వాడొద్దు

పార్టీలు, నేతలు గౌరవంగా వ్యవహరించాలి

ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు వర్తిస్తాయి

అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం సూచన

న్యూఢిల్లీ, డిసెంబరు 21: అంగవైకల్యం సంబంధించిన మాటలను రాజకీయ ప్రసంగాల్లో వాడరాదని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను కోరింది. రాజకీయ పార్టీలు, నేతలు/అభ్యర్థులు తమ ప్రసంగాలు, ప్రచారంలో ఇలాంటి పదాలను వాడటం వల్ల దివ్యాంగుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంది. బుధవారం అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ పలు సూచనలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, నేతలు వైకల్యాన్ని ఎత్తి చూపేలా ఏ విధంగానూ మాట్లాడరాదంటూ, కొన్ని పదాలను ఉదాహరించింది. అలాంటి పదాలు మాట్లాడటం పూర్తిగా మానుకోవాలని, గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. ఎవరైనా అభ్యంతరకర పదాలు వాడితే దివ్యాంగుల హక్కుల చట్టం కింద చర్యలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Updated Date - Dec 22 , 2023 | 06:34 AM