ఏప్రిల్‌ 1కి ముందే విద్యా సంవత్సరం వద్దు

ABN , First Publish Date - 2023-03-19T01:24:51+05:30 IST

తన అనుబంధ పాఠశాలలు విద్యాసంవత్సరాన్ని ఏప్రిల్‌1 కంటే ముందే ప్రారంభించడాన్ని సీబీఎ్‌సఈ బోర్డు తప్పుబట్టింది.

ఏప్రిల్‌ 1కి ముందే విద్యా సంవత్సరం వద్దు

తన అనుబంధ పాఠశాలలకు సీబీఎ్‌సఈ హెచ్చరిక

న్యూఢిల్లీ, మార్చి 18: తన అనుబంధ పాఠశాలలు విద్యాసంవత్సరాన్ని ఏప్రిల్‌1 కంటే ముందే ప్రారంభించడాన్ని సీబీఎ్‌సఈ బోర్డు తప్పుబట్టింది. కొన్ని పాఠశాలలు ఇప్పటికే 10వ, 12వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాదికి చెందిన పాఠాలు చెప్పడం మొదలెట్టాయని, వెంటనే వాటిని నిలిపేయాలని ఆదేశించింది. లేకుటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిర్దిష్టమైన గడువుకంటే ముందే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడం వల్ల విద్యార్థులు క్రీడలు, కళలు లాంటి విద్యేతర విషయాలపై దృష్టి సారించలేరని, దాని వల్ల వారు శారీరకంగా, మానసికంగా కుంగుబాటుకు లోన య్యే అవకాశాలున్నాయని సీబీఎ్‌సఈ సెక్రటరీ అనురాగ్‌ త్రిపాఠి అన్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌1 నుంచి మార్చి31 వరకు విద్యాసంవత్సరాన్ని నిర్వహించాలని తమ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు, యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు త్రిపాఠి వెల్లడించారు.

Updated Date - 2023-03-19T01:24:51+05:30 IST