నాకు ఎలాంటి అసంతృప్తి లేదు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:50 AM
ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును పలువురు నేతలు ప్రతిపాదించడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలను బిహార్ సీఎం
ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరుపై నితీశ్
పట్నా, డిసెంబరు 25: ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును పలువురు నేతలు ప్రతిపాదించడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలను బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఖండించారు. ఆ విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. మొదటి నుంచి తాను ఏ పదవిని ఆశించలేదని, కేవలం కూటమిలో ఎక్కువ పార్టీలను చేర్చడమే లక్ష్యంగా పనిచేశానని, ఇకపై అలాగే చేస్తానని స్పష్టంచేశారు. వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించిన అనంతరం విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.