Share News

NIA:శివమొగ్గ పేలుడు కేసు నిందితులకు నోటీసులు ఇచ్చిన ఎన్ఐఏ

ABN , First Publish Date - 2023-10-19T10:52:56+05:30 IST

తమిళనాడు రాష్ట్రం శివమొగ్గ(Shivamogga)లో జరిగిన ట్రయల్ పేలుడు కేసులో తీర్థహళ్లికి చెందిన నలుగురికి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA నోటీసులు ఇచ్చింది. నిందితులు షంషుద్దీన్, రిజ్వాన్, నజీబ్ వుల్లా, తమీమ్‌లను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

NIA:శివమొగ్గ పేలుడు కేసు నిందితులకు నోటీసులు ఇచ్చిన ఎన్ఐఏ

చెన్నై: తమిళనాడు రాష్ట్రం శివమొగ్గ(Shivamogga)లో జరిగిన ట్రయల్ పేలుడు కేసులో తీర్థహళ్లికి చెందిన నలుగురికి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA నోటీసులు ఇచ్చింది. నిందితులు షంషుద్దీన్, రిజ్వాన్, నజీబ్ వుల్లా, తమీమ్‌లను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నంలోపు బెంగళూరులోని ఎన్ఐఏ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించింది. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు కలిగి ఉన్న మాజ్ మునీర్ అహ్మద్, సయ్యద్ యాసిన్ అనే ఇద్దరు వ్యక్తులను సెప్టెంబరు 23, 2022 న శివమొగ్గ పోలీసులు అరెస్టు చేసి, వారి నుండి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తీర్థహళ్లి కేసు వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 15, 2023న శివమొగ్గలో హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ పోస్టర్‌పై మత ఘర్షణల సందర్భంగా జరిగిన కత్తిపోటు కేసులో వీరిపై గతంలోనే కేసు నమోదైంది.


విచారణ సమయంలో అహ్మద్ తుంగభద్ర నది ఒడ్డున ట్రయల్ బాంబు పేలుళ్లు(Bomb Blast) నిర్వహించినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతని సహచరులు మహ్మద్ షరీక్, సయ్యద్ యాసిన్‌లతో కలిసి శివమొగ్గ జిల్లాలోని నదీతీరంలోని కెమ్మనగుండిలో బాంబు పేల్చారని వివరించారు. వీరంతా బాంబు తయారీ పద్ధతులపై గతంలోనే శిక్షణ పొందినట్లు చెప్పారు. అయితే షరీక్ మంగళూరులో బాంబు పేలుడుకు ప్రయత్నించడం విఫలమవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళూరు పేలుడు, తీర్థహళ్లి పేలుళ్లతోపాటు నగరంలో పలు ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ప్లాన్ చేసి ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్న క్రమంలో ఎన్‌ఐఏ అనుమానితులకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్‌లో మంగళూరు పేలుళ్ల సూత్రధారి అరాఫత్ అలీని ఎన్‌ఐఏ అరెస్టు చేసిన తర్వాత ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరాఫత్ అలీ ఢిల్లీకి రాగానే పట్టుబడినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మరిన్ని దాడులు చేయాలనే ఉద్దేశంతో షరీక్ ఉన్నాడని అరాఫత్ అలీ ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందించాడు.

Updated Date - 2023-10-19T10:52:56+05:30 IST