వచ్చే ఏడాదికి ముస్లిం జనాభా 19.75 కోట్లు

ABN , First Publish Date - 2023-07-22T01:08:43+05:30 IST

వచ్చే ఏడాదినాటికి దేశంలో ముస్లింల జనాభా 19.75 కోట్లకు చేరుకోవచ్చని కేంద్రప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. ఈమేరకు టీఎంసీ ఎంపీ మాలారాయ్‌ అడిగిన ప్రశ్నకు

వచ్చే ఏడాదికి ముస్లిం జనాభా 19.75 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 21: వచ్చే ఏడాదినాటికి దేశంలో ముస్లింల జనాభా 19.75 కోట్లకు చేరుకోవచ్చని కేంద్రప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. ఈమేరకు టీఎంసీ ఎంపీ మాలారాయ్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ‘‘2011నాటికి దేశంలో ముస్లింల జనాభా 17.22 కోట్లుగా ఉంది. ఇది మొత్తం జనాభాలో 14.2 శాతం. వచ్చే ఏడాదికి 19.75 కోట్లకు చేరుతుంది. ఇక 2014, మార్చి 31 తర్వాత దేశంలో తొలిసారిగా కొత్త ఇంటిని నిర్మించుకున్న లేదా కొనుగోలు చేసిన ముస్లింలు 50.2శాతంగా ఉన్నారు’’ అని ఇరానీ వెల్లడించారు.

Updated Date - 2023-07-22T01:08:43+05:30 IST