మోదీ మూడోసారీ ప్రధాని అవుతారు

ABN , First Publish Date - 2023-05-26T04:23:13+05:30 IST

ప్రజలు భారీ మెజారిటీతో నరేంద్ర మోదీని రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారని, 2024 ఎన్నికలలో 300కు పైగా సీట్లు సాధించి మూడోసారి కూడా ఆయన ప్రధాని అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

మోదీ మూడోసారీ ప్రధాని అవుతారు

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

గువాహటి, మే 25: ప్రజలు భారీ మెజారిటీతో నరేంద్ర మోదీని రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారని, 2024 ఎన్నికలలో 300కు పైగా సీట్లు సాధించి మూడోసారి కూడా ఆయన ప్రధాని అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కాంగ్రె్‌సది నెగెటివ్‌ దృక్పథమని, ఆ పార్టీకి లోక్‌సభలో ఇప్పుడు ఉన్నన్ని సీట్లు కూడా రావని చెప్పారు. గువాహటిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో అసోం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 44,703 మందికి నియామక పత్రాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు బహిష్కరించడం చౌకబారు రాజకీయాలకు ఉదాహరణ అని విమర్శించారు. కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతిచే ప్రారంభించకపోవడాన్ని విపక్షాలు సాకుగా చూపుతున్నాయని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసెంబ్లీల భూమిపూజ కార్యక్రమాలకు గవర్నర్‌ను ఆహానించలేదన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లో కొత్త అసెంబ్లీ భవనానికి భూమిపూజ చేసినప్పుడు గవర్నర్‌ను పిలవలేదని, కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని మాత్రం ఆహ్వానించారని చెప్పారు. ఝార్ఖండ్‌, అసోం, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా గతంలో చోటుచేసుకున్న ఈ తరహా ఘటనలను ప్రస్తావించారు.

Updated Date - 2023-05-26T04:23:13+05:30 IST