అత్యంత ధనవంతుడిగా మళ్లీ మస్క్‌

ABN , First Publish Date - 2023-06-02T04:38:52+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని టెస్లా అధినేత ఈలాన్‌ మస్క్‌ మళ్లీ సాధించారు.

అత్యంత ధనవంతుడిగా మళ్లీ మస్క్‌

న్యూఢిల్లీ, జూన్‌ 1: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని టెస్లా అధినేత ఈలాన్‌ మస్క్‌ మళ్లీ సాధించారు. ఇప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న లూయీ వుట్టాన్‌ కంపెనీ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను ఆయన వెనక్కు నెట్టారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఇండెక్స్‌ ప్రకారం.. జూన్‌ 1 నాటికి మస్క్‌ ఆస్తుల విలువ 192 బిలియన్‌ డాలర్లు. ఆర్నాల్ట్‌ ఆస్తుల విలువ 187 బిలియన్‌ డాలర్లు. అయితే, బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ న్యూయార్క్‌లో ట్రేడింగ్‌కు అనుగుణంగా ప్రతీ రోజు మారుతూ ఉంటుంది. కాగా, టెస్లా షేర్లు ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి 89ు పెరగడం విశేషం.

Updated Date - 2023-06-02T04:38:52+05:30 IST