మోదీ చేసిన అప్పు.. కోటి కోట్లు:కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2023-06-11T02:51:15+05:30 IST

ప్రధాని మోదీ హయాంలో భారతదేశ అప్పు మూడింతలై.. రూ.155 లక్షల కోట్లకు (రూ.కోటిన్నర కోట్లు) చేరిందని కాంగ్రెస్‌ మండిపడింది.

మోదీ చేసిన అప్పు.. కోటి కోట్లు:కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జూన్‌ 10: ప్రధాని మోదీ హయాంలో భారతదేశ అప్పు మూడింతలై.. రూ.155 లక్షల కోట్లకు (రూ.కోటిన్నర కోట్లు) చేరిందని కాంగ్రెస్‌ మండిపడింది. దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. 2014నాటికి దేశ రుణ భారం రూ.55 లక్షల కోట్లుగా ఉందని.. మోదీ హయాంలో అది మరో 100 లక్షల (కోటి) కోట్ల రూపాయల మేర పెరిగిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనతే ఆందోళన వెలిబుచ్చారు. 67 సంవత్సరాల్లో 14 మంది ప్రధానమంత్రులు రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఒక్క మోదీనే కోటి కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. ‘‘దేశ ఆర్థిక నిర్వహణ అంటే పత్రికల్లో పతాకశీర్షికల నిర్వహణ కాదు. టెలీప్రాంప్టర్లు, వాట్సాప్‌ ఫార్వార్డ్‌ల ద్వారా ఆర్థిక నిర్వహణ చేయలేరు’’ అని ఆమె ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-06-11T02:51:15+05:30 IST