Minister: రాష్ట్రంలో.. పరుగులు తీస్తున్న పర్యాటకరంగం
ABN , First Publish Date - 2023-01-18T10:20:17+05:30 IST
అన్ని రంగాలతోపాటు పర్యాటక రంగ అభివృద్ధికి కూడా సీఎం స్టాలిన్ కృషిచేస్తున్నారని, రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరిగిందని
- మంత్రి రామచంద్రన్
పెరంబూర్(చెన్నై), జనవరి 17: అన్ని రంగాలతోపాటు పర్యాటక రంగ అభివృద్ధికి కూడా సీఎం స్టాలిన్ కృషిచేస్తున్నారని, రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరిగిందని పర్యాటక శాఖ మంత్రి రామచంద్రన్(Minister Ramachandran) తెలిపారు. నీలగిరి జిల్లా ఊటీలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, కరోనా సమయంలో రెండేళ్లుగా పర్యాటకుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో, గత ఏడాది 2 లక్షల మంది విదేశీయులు, 11 కోట్ల మంది భారతీయులు రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రవాణా సేవలు, బస వసతి తదితరాలు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు.