ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా?

ABN , First Publish Date - 2023-09-18T02:05:24+05:30 IST

సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ..

ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా?

చెన్నై, సెప్టెంబరు 17: సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు. ‘మీరు (ఉదయనిధి స్టాలిన్‌) రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయ్యారు. ప్రమాణం సందర్భంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీయబోనని స్పష్టం చేశారు. ఒకవేళ అది మీ భావజాలమే అయినా.. ఇతరుల మతాన్ని నాశనం చేస్తామని చెప్పే హక్కు మీకు లేదు’ అని కేంద్ర మంత్రి అన్నారు. ‘ఇతర మతాల్లో సమస్యలు లేవా..? అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లేదా..? వీటిపై మాట్లాడే సాహసం చేస్తారా..? మీకు అంత ధైర్యం ఉందా..?’ అని నిర్మల ప్రశ్నించారు.

Updated Date - 2023-09-18T02:05:24+05:30 IST