‘మేరా యువ భారత్’కు కేంద్రం ఆమోదం
ABN , First Publish Date - 2023-10-12T03:32:13+05:30 IST
దేశ యువత కోసం మోదీ సర్కారు ‘మేరా యువ భారత్ (మై భారత్)’ పేరిట స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యువత అభివృద్ధి
యువత కోసం స్వయంప్రతిపత్తి సంస్థ
ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ, అక్టోబరు 11: దేశ యువత కోసం మోదీ సర్కారు ‘మేరా యువ భారత్ (మై భారత్)’ పేరిట స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యువత అభివృద్ధి కోసం టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, యువత నేతృత్వంలో అభివృద్ధే లక్ష్యంగా మేరా యువ భారత్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనికి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. యువతీయువకులు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఈ సంస్థ వారికి సమాన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు.ఈ నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మేరా యువ భారత్‌ను జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు.