హృద్రోగ వ్యాధిగ్రస్తుల్లో మేధాశక్తి క్షీణింపు

ABN , First Publish Date - 2023-06-02T02:51:48+05:30 IST

సాధారణ వ్యక్తులతో పోలిస్తే గుండెపోటుకు గురైన వారిలో మేఽధాశక్తి క్రమంగా క్షీణిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

హృద్రోగ వ్యాధిగ్రస్తుల్లో మేధాశక్తి క్షీణింపు

న్యూఢిల్లీ, జూన్‌ 1: సాధారణ వ్యక్తులతో పోలిస్తే గుండెపోటుకు గురైన వారిలో మేఽధాశక్తి క్రమంగా క్షీణిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని జాన్స్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆధ్వర్యంలో పరిశోధకులు 1971-2019 మధ్యకాలంలో గుండెపోటుకు గురైనవారిపై, సాధారణ వ్యక్తులపై చేసిన ఆరు అధ్యయనాల ఫలితాలను పరిశోధించారు. గుండెపోటుకు గురైన వారిలో జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తుందని గుర్తించారు. గుండెకు రక్తసరఫరా తగ్గిపోవడం లేదా ఆగిపోవడంతో గుండెపోటు సంభవిస్తుంది. దీంతో కండరాలు ఆక్సిజన్‌ అందక, చనిపోతాయి. ఇలా గుండెపోటుకు గురైన వారిలో కొన్నేళ్లకు జ్ఞాపకశక్తి తగ్గిపోతోందని పరిశోధకులు వెల్లడించారు. కాగా మొత్తం 30,465 మందిపై ఈ పరిశోధన చేయగా... వారిలో 1033 మంది ఒకసారి, 137 మంది రెండుసార్లు గుండెపోటుకు గురయ్యారు.

Updated Date - 2023-06-02T03:12:49+05:30 IST