గుజరాత్‌ జైళ్లలో భారీ సెర్చ్‌ ఆపరేషన్‌

ABN , First Publish Date - 2023-03-26T00:45:38+05:30 IST

గుజరాత్‌ పోలీసులు ఆ రాష్ట్రంలోని జైళ్లలో భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. 1700 మంది పోలీసులు పాల్గొన్న ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో మొబైల్‌ ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు,

గుజరాత్‌ జైళ్లలో భారీ సెర్చ్‌ ఆపరేషన్‌

మొబైల్‌ ఫోన్లు, మత్తు పదార్థాలు స్వాధీనం

అహ్మదాబాద్‌, మార్చి 25: గుజరాత్‌ పోలీసులు ఆ రాష్ట్రంలోని జైళ్లలో భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. 1700 మంది పోలీసులు పాల్గొన్న ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో మొబైల్‌ ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు, మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కెమెరాలు ధరించిన పోలీసులు రాష్ట్రంలోని 17 జైళ్లలో వీడియో చిత్రీకరిస్తూ ఈ తనిఖీలు నిర్వహించడం విశేషం. అహ్మదాబాద్‌, వదోదర, సూరత్‌, రాజ్‌కోట్‌లలోని సెంట్రల్‌ జైళ్లలోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. 16 మొబైల్‌ ఫోన్లు, 10 ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, 39 ప్రాణాంతక వస్తువులు, మూడు నార్కోటిక్‌ ఉత్పత్తులు, 519 పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-03-26T00:45:43+05:30 IST