Marina Beach: కరుణ కలం స్తూపంతో పాటు సముద్ర గర్భంలో మ్యూజియం

ABN , First Publish Date - 2023-02-02T10:24:47+05:30 IST

స్థానిక మెరీనాబీచ్‌(Marina Beach)లోని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి వద్ద కలం స్తూపంతో పాటు ఆయన జీవిత విశేషాలతో ఫొటోలు, సాహితీ ర

Marina Beach: కరుణ కలం స్తూపంతో పాటు సముద్ర గర్భంలో మ్యూజియం

చెన్నై, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక మెరీనాబీచ్‌(Marina Beach)లోని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి వద్ద కలం స్తూపంతో పాటు ఆయన జీవిత విశేషాలతో ఫొటోలు, సాహితీ రచనల విశేషాలు, ప్రసంగాల దృశ్య శ్రవణ ప్రదర్శనలతో సముద్రగర్భంలో మ్యూజియం కూడా నిర్మించనున్నారు. కరుణా సమాధి వెనుకవైపు 360 మీటర్ల దూరంలో సముద్రంలో భారీ కలం స్తూపాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కలం స్తూపం వరకు నడిచి వెళ్లేందుకు అద్దాల వంతె కూడా నిర్మిస్తారు. ఈ స్తూపాన్ని నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతిచ్చింది. అదే సమయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలి ఆ స్తూపం నిర్మాణం వలన పర్యావరణానికి ఏదైనా హాని జరుగుతుందా లేదా అని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చెన్నై జిల్లా కలెక్టర్‌ అమృతజ్యోతి అధ్యక్షతన మంగళవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభ రసాభాసగా ముగిసిన విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ, నామ్‌తమిళర్‌ కట్చి నాయకులు స్తూప నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

రూ.80 లక్షలతో మ్యూజియం...

కలం స్తూపం, అద్దాల వంతెనతోపాటు కరుణానిధి జీవిత విశేషాలను తెలిపే మ్యూజియంను రూ.80లక్షలతో నిర్మించనున్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు. ఇక సమాధి దగ్గర కూడా మినీ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. సమాధిపై వివిధ రంగుల్లో కాంతులు ప్రజ్వరిల్లింపజేసే విధంగా స్పెషల్‌ డిజిటల్‌ లైటింగ్‌ కూడా ఏర్పాటు చేస్తారు.

Updated Date - 2023-02-02T10:24:48+05:30 IST