‘ఆమెనే ఆత్మహత్య చేసుకుంది’

ABN , First Publish Date - 2023-06-10T03:30:54+05:30 IST

‘ఆమెను నేను చంపలేదు. విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. నా మెడకు చుట్టుకుంటుందని ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాను.

‘ఆమెనే ఆత్మహత్య చేసుకుంది’

ముంబై, జూన్‌ 9: ‘ఆమెను నేను చంపలేదు. విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. నా మెడకు చుట్టుకుంటుందని ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాను. అందుకే ముక్కలు చేశాను’ అని ముంబైలో సరస్వతి వైద్య (36) హత్య కేసులో నిందితుడు మనోజ్‌ సానే (56) విచారణలో చెబుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమెతో శారీరక బంధం లేదని, తనకు ఎయిడ్స్‌ అని కూడా చెబుతున్నాడని పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని వదిలించుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడట. అయితే ఈ కథనం తమను తప్పుదోవ పట్టించడానికే కావచ్చని పోలీసులు అంటున్నారు.

Updated Date - 2023-06-10T03:31:01+05:30 IST