‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో మరో విజయం

ABN , First Publish Date - 2023-03-05T01:09:53+05:30 IST

రక్షణ రంగంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు మరో గొప్ప విజయం లభించింది. యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌(ఏఎ్‌సడబ్ల్యూ) అండర్‌వాటర్‌ రాకెట్‌ ఆర్‌జీబీ-60లో వినియోగించే ఫ్యూజ్‌

‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో మరో విజయం

జలాంతర్గాముల పనిపట్టే రాకెట్లకు ఫ్యూజ్‌ తయారు

న్యూఢిల్లీ, మార్చి 4: రక్షణ రంగంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు మరో గొప్ప విజయం లభించింది. యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌(ఏఎ్‌సడబ్ల్యూ) అండర్‌వాటర్‌ రాకెట్‌ ఆర్‌జీబీ-60లో వినియోగించే ఫ్యూజ్‌(వైడీబీ-60)ను తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థ ఎం/ఎస్‌ ఎకనామిక్స్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌(ఈఈఎల్‌) దీన్ని తయారు చేసింది. ఈఈఎల్‌ సీఎండీ సత్యనారాయణ్‌ నువాల్‌ ఈ ఫ్యూజ్‌ల తొలి కన్‌సైన్‌మెంట్‌ను నావల్‌ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌ఎన్‌ ఘోర్మడేకు అందజేశారు. ‘‘సాయుధ దళాల్లో ఆత్మనిర్భరతకు ఇది భారీ ఊపు’’ అని ఘోర్మడే శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-05T01:09:53+05:30 IST