Makara Jyothi: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

ABN , First Publish Date - 2023-01-14T19:38:44+05:30 IST

శబరిమల (Sabarimala)లో భక్తులకు మకరజ్యోతి (Makara Jyothi) దివ్యదర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప...

Makara Jyothi: శబరిమలలో మకర జ్యోతి దర్శనం

శబరిమల: శబరిమల (Sabarimala)లో భక్తులకు మకరజ్యోతి (Makara Jyothi) దివ్యదర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమిచ్చారని భక్తులు విశ్వసిస్తారు. మకరజ్యోతిని దర్శనం వల్ల భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. మకరజ్యోతి దర్శనం కోసం శబరిమల భక్తజనం తరలివచ్చింది. పంబ, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ఏర్పాట్లు చేశారు. మరకజ్యోతి దర్శనం కావడంతో భక్తి పారవశ్యంలో అయ్యప్ప భక్తులు మునిగిపోయారు.

అయ్యప్ప నామస్మరణతో శబరిగిరి మారుమోగుతోంది. మకర జ్యోతి సందర్భంగా భక్తులతో శబరిగిరులు నిండిపోయాయి. మకర జ్యోతి దర్శనానికి లక్షలాదిగా అయ్యప్ప భక్తులు (Ayyappa devotees) తరలివచ్చారు. ఇరుముడులతో వచ్చిన అయ్యప్పలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మకర సంక్రాంతి (Makara Sankranti) రోజు జ్యోతిని దర్శించుకుంటే సాక్షాత్తు అయ్యప్పస్వామి కనపడినట్లుగా భక్తులు భావిస్తారు. అందుకనే జ్యోతికి ప్రతి ఏడాది ఎక్కువగా అయ్యప్పలు వస్తుంటారు.

Updated Date - 2023-01-14T19:59:32+05:30 IST