‘మహదేవ్ యాప్’ స్కామ్ సూత్రధారి రవి అరెస్ట్
ABN , Publish Date - Dec 14 , 2023 | 05:19 AM
ఛత్తీస్‌గఢ్‌ను కుదిపేసి, అక్కడి కాంగ్రెస్ ప్రభుతాన్ని ఎన్నికల ముందు తీవ్రంగా ఇబ్బందిపెట్టిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో కీలక వ్యక్తుల్లో ఒకరు, యాప్ ప్రమోటర్ రవి
న్యూఢిల్లీ, డిసెంబరు 13: ఛత్తీస్‌గఢ్‌ను కుదిపేసి, అక్కడి కాంగ్రెస్ ప్రభుతాన్ని ఎన్నికల ముందు తీవ్రంగా ఇబ్బందిపెట్టిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో కీలక వ్యక్తుల్లో ఒకరు, యాప్ ప్రమోటర్ రవి ఉప్పల్ దుబాయ్‌లో పట్టుబడ్డారు. రోజుకు రూ.200 కోట్లు ఆర్జించే మహదేవ్ బెట్టింగ్ యాప్‌ను దుబాయ్ కేంద్రంగా సౌరభ్ చంద్రకర్ అనే మరో వ్యక్తితో కలిసి రవి ఉప్పల్ నిర్వహిస్తున్నాడు. ఈడీ వినతితో ఇంటర్‌పోల్ అతని అరెస్టుకు రెడ్ కార్నల్ నోటీసు జారీచేయగా, దుబాయ్‌లో వారం క్రితం పోలీసులు రవిని అరెస్టు చేశారు.