కూర్చొని మాట్లాడుకుందాం రండి!

ABN , First Publish Date - 2023-01-27T02:56:02+05:30 IST

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఎట్టకేలకు కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా స్పందించారు. సీఎం కేజ్రీవాల్‌ను శుక్రవారం తన అధికార నివాసమైన రాజ్‌నివా్‌సకు

కూర్చొని మాట్లాడుకుందాం రండి!

కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పిలుపు

మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి.. నేడు రాజ్‌నివాస్‌కు రావాలని సూచన

న్యూఢిల్లీ, జనవరి 26: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఎట్టకేలకు కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా స్పందించారు. సీఎం కేజ్రీవాల్‌ను శుక్రవారం తన అధికార నివాసమైన రాజ్‌నివా్‌సకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇరువురి మధ్య వివాదాలకు కారణమవుతున్న పలు అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామని, మంత్రులతోపాటు 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి రావాలని సూచించారు. దీంతో ఎల్జీకి, ఆప్‌ ప్రభుత్వానికి మధ్య సయోధ్య దిశగా ఒక అడుగు పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 30 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను శిక్షణ కోసం విదేశాలకు పంపించనున్నట్లు పేర్కొంటూ కేజ్రీవాల్‌ సర్కారు ఇటీవల పంపిన ఫైలును ఎల్జీ సక్సేనా తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ సీఎం కేజ్రీవాల్‌ ఈ నెల 16న ఆప్‌ ఎమ్మెల్యేలతో కలిసి విధానసభ నుంచి రాజ్‌నివా్‌సకు ప్రదర్శన చేపట్టారు. ఎల్జీని కలిసేందుకు ప్రయత్నించగా.. అందుకు సక్సేనా నిరాకరించారు. అయితే గణతంత్ర దినోత్సవానికి ముందురోజు ఎల్జీ నిర్వహించిన ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి సీఎం కేజ్రీవాల్‌ హాజరయ్యారు. కాగా, సక్సేనా పిలుపును కేజ్రీవాల్‌ నిరాకరించారు. శుక్రవారం తాను పంజాబ్‌ వెళ్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-01-27T02:56:03+05:30 IST