యూపీ బడి పుస్తకాల్లో సావర్కర్‌పై పాఠాలు
ABN , First Publish Date - 2023-06-26T01:02:56+05:30 IST
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించనున్న పాఠ్యపుస్తకాల్లో హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్, భారతీయ జన సంఘ్ పార్టీ నాయకుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌లకు చోటు కల్పించారు....
లఖ్‌నవూ, జూన్ 25: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించనున్న పాఠ్యపుస్తకాల్లో హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్, భారతీయ జన సంఘ్ పార్టీ నాయకుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌లకు చోటు కల్పించారు. 9వ తరగతి పుస్తకంలో సావర్కర్‌పై, 11వ తరగతి పాఠ్య పుస్తకంలో ఉపాధ్యాయ్‌పై పాఠాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ, తిలక్, అంబేడ్కర్ సహా మొత్తం 50 మంది ప్రముఖులపై పాఠాలను రూపొందించారు. మోరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు కింద వీటిని బోధిస్తారు. కంపల్సరీ సబ్జెక్టులో భాగంగా విద్యార్థులు వీటిని తప్పకుండా చదవాల్సి ఉంటుంది. ప్రముఖల జీవితాలపై పాఠాలను రూపొందిస్తామని 2022 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. దాన్ని ప్రస్తుతం అమలు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. స్వాతంత్ర్యోద్యమంలో సావర్కర్, ఉపాధ్యాయుల పాత్ర ఏమిటని ప్రశ్నించాయి. ఇది విద్యాపరమైన అవినీతి అని సమాజ్‌వాదీ పార్టీ వ్యాఖ్యానించింది.