నవంబరు 1 లోగా దేశం విడిచి వెళ్లండి

ABN , First Publish Date - 2023-10-05T02:25:05+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ శరణార్థులపై పాకిస్థాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా దేశంలో నివసిస్తున్న వలసదారులు నవంబరు 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది...

నవంబరు 1 లోగా దేశం విడిచి వెళ్లండి

ఇస్లామాబాద్‌, అక్టోబరు 4: అఫ్ఘానిస్థాన్‌ శరణార్థులపై పాకిస్థాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా దేశంలో నివసిస్తున్న వలసదారులు నవంబరు 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేకపోతే వారందరినీ గుర్తించి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ ఏడాది దేశంలో జరిగిన 24 ఆత్మాహుతి దాడులలో 14 దాడులు అఫ్ఘానిస్థాన్‌ దేశస్థులే చేసినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సర్ఫరాజ్‌ బుగ్తీ తెలిపారు. ప్రధాని, ఆర్మీ చీఫ్‌లతో శాంతిభద్రతలపై సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. 17 లక్షల 30 వేల మంది అఫ్ఘానీలకు దేశంలో నివసించేందుకు సరైన అనుమతి పత్రాలు లేవని తెలిపారు.

Updated Date - 2023-10-05T02:25:05+05:30 IST