Lalit Modi : హరీశ్ సాల్వే పెళ్లిలో లలిత్ మోదీ కలకలం
ABN , First Publish Date - 2023-09-06T04:20:01+05:30 IST
ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వివాహ వేడుకకు పరారీలో ఉన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ హాజరు కావడం కలకలం రేపింది. సాల్వేను ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5 : ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వివాహ వేడుకకు పరారీలో ఉన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ హాజరు కావడం కలకలం రేపింది. సాల్వేను ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ అత్యున్నత న్యాయ కమిటీకి మోదీ సర్కారు ఇటీవలే నియమించడంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం కూడా రేపింది. బ్రిటన్‌కు చెందిన ట్రీనాను హరీశ్ సాల్వే లండన్‌లో ఆదివారం వివాహం చేసుకున్నారు. లలిత్ మోదీ 2010 నుంచి పరారీలో ఉన్నారు. సాల్వే వివాహ వేడుకలో అలాంటి వివాదాస్పద వ్యక్తి పాల్గొనడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. భారతీయ చట్టాలను తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి మోదీ ప్రభుత్వానికి అత్యంత ఇష్టుడైన న్యాయవాది చేసుకున్న పెళ్లికి ఎలా హాజరవుతారని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు. మోదీ ప్రతిష్ఠకు మాయనిమచ్చ ఇదని ‘ఆప్’ మండిపడింది.