కృష్ణజన్మభూమి కేసుఅలహాబాద్‌ హైకోర్టుకు

ABN , First Publish Date - 2023-05-27T04:06:04+05:30 IST

శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించి మఽథుర కోర్టు విచారిస్తున్న కేసుపై అలహాబాద్‌ హైకోర్టు విచారణ జరుపనుంది.

కృష్ణజన్మభూమి కేసుఅలహాబాద్‌ హైకోర్టుకు

అలహాబాద్‌, మే 26: శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించి మఽథుర కోర్టు విచారిస్తున్న కేసుపై అలహాబాద్‌ హైకోర్టు విచారణ జరుపనుంది. సదరు కేసును హైకోర్టు శుక్రవారం తనకు బదిలీ చేసుకుంది. షాహి మసీద్‌ ఈద్గా నిర్మించిన శ్రీకృష్ణ జన్మభూమి స్థలంపై తమకు హక్కుందంటూ తాము మథుర జిల్లా కోర్టులో దాఖలు చేసిన కేసును హైకోర్టుకు బదిలీ చేయాలని హిందూ భక్తులు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నెల 3వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం వెలువరించింది. హిందూ ఆలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదు కట్టారని.. ఆ నిర్మాణాన్ని మసీదుగా పరిగణించరాదని.. మసీదు నిర్మాణానికి ఆ స్థలాన్ని ఎప్పుడూ కేటాయించలేదని కట్రా కేశవ్‌దేవ్‌ ఖేవత్‌ మధురకు చెందిన ‘భగవాన్‌ శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌’ సంస్థ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - 2023-05-27T04:06:04+05:30 IST