Kamal Haasan : ఈస్ట్‌ ఇండియా కంపెనీ పోయి ‘నార్త్‌ ఇండియా’ వచ్చింది

ABN , First Publish Date - 2023-02-21T03:55:33+05:30 IST

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kamal Haasan : ఈస్ట్‌ ఇండియా కంపెనీ పోయి ‘నార్త్‌ ఇండియా’ వచ్చింది

చెన్నై, ఫిబ్రవరి 20 ((ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేశం నుంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వెళ్లిపోయింది. కానీ ఇపుడు నార్త్‌ ఇండియా కంపెనీ వచ్చింది. దీన్ని ఎలా అంగీకరిస్తాం?’ అని కమల్‌ వ్యాఖ్యానించారు. సోమవారం తమిళనాడులోని ఈరోడ్‌ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ.. ఆంగ్లేయులు అమలు చేసిన విభజన వాదాన్ని ఇప్పుడు మళ్లీ అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రజల భవిష్యత్తుతో పాటు యావత్‌ దేశాన్ని తాకట్టు పెట్టడాన్ని చోద్యం చూస్తూ ఉండబోమని, కేంద్ర ప్రభుత్వ తీరు ఏమాత్రం సరికాదని విమర్శించారు.

Updated Date - 2023-02-21T03:55:35+05:30 IST