Insurance: వినాయకుడికి రూ.360 కోట్ల బీమా.. ఎక్కడ అంటే..?
ABN , First Publish Date - 2023-09-22T17:41:31+05:30 IST
దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై(Mumbai)లో జీఎస్ బీ సేవా మండల్(GSB Seva Mandal) అనే సంఘం గణేష్ ఉత్సవాలకు(Ganesh Celebrations) రూ.360 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది.
దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై(Mumbai)లో జీఎస్ బీ సేవా మండల్(GSB Seva Mandal) అనే సంఘం గణేష్ ఉత్సవాలకు(Ganesh Celebrations) రూ.360 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది. అదే సంఘం గతేడాది రూ.316 కోట్లు, 2016లో రూ.300 కోట్ల చొప్పున ఇన్సూరెన్స్(Insurance) తీసుకోవడం గమనార్హం. అంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవడం అనే సందేహం మీకు రావచ్చు. ఇక్కడ ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా స్వామికి 70 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. 295 కిలోల వెండి, తదితర లోహాలతో చేసినవీ పూజలో వినియోగిస్తారు.
ఈ బీమా గురించి జీఎస్ బీ సేవా మండల్ సిబ్బంది మాట్లాడుతూ.. బంగారం, వెండి తదితర అభరణాలతో పాటు వాలంటీర్లు, పూజారులు, వంట వారు, పాదరక్షల నిర్వాహకులు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రమాద బీమా కోసం ఏటా ఇలా చేస్తున్నామని వెల్లడించారు. ఈ బీమాను న్యూ ఇండియా అస్యూరెన్స్(New India Assurance), ప్రభుత్వ సాధారణ బీమా కంపె(general insurance company)నీ అందిస్తోంది. జీఎస్‌బీ గణేష్ మండల్ మాత్రమే కాదు, అనేక ఇతర గణేష్ మండపాలు సైతం బీమా రక్షణను తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. కేటగిరీల వారీగా బీమా కవరేజీ వివరాలివే..
1. రూ.38.47 కోట్లు: బంగారం, వెండి, తదితర ఆభరణాలతో సహా వివిధ రకాల రిస్క్‌లను కవర్ చేస్తుంది.
2. రూ. 2 కోట్లు: అగ్నిమాపక, ప్రత్యేక ప్రమాదాల సమయంలో నష్టపోయిన వాటిని కవర్ చేస్తుంది.
3.రూ.30 కోట్లు: పబ్లిక్ లయబిలిటీ(Public liability)ని కవర్ చేస్తుంది.
4. రూ.289.50 కోట్లు: వాలంటీర్లు, వంట చేసేవారు, బండ్లు, చప్పల్ స్టాల్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు మొదలైన వారికి వ్యక్తిగత ప్రమాద బీమా కింద రక్షణ.
5. రూ.43 లక్షలు: వేదిక వద్ద స్టాండర్డ్ ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్ మెంట్ కోసం ఈ బీమా వర్తిస్తుంది.