Share News

OTP: దేశంలో కచ్చితమైన సమయపాలన పాటించే ఎయిర్‌లైన్స్ ఏదో తెలుసా?

ABN , Publish Date - Dec 17 , 2023 | 08:46 PM

దేశంలో కచ్చితమైన సమయపాలన పాటించిన ఎయిర్‌లైన్స్‌గా ఆకాశా ఎయిర్‌లైన్స్ తాజాగా గుర్తింపు దక్కించుకుంది.

OTP: దేశంలో కచ్చితమైన సమయపాలన పాటించే ఎయిర్‌లైన్స్ ఏదో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: విమానాలు ఆలస్యంగా బయలుదేరడం, గమ్యానికి చేరుకోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇందుకు అనేక కారణాలు. అయితే, దేశంలో కచ్చితమైన సమయపాలన పాటించిన ఎయిర్‌లైన్స్‌గా ఆకాశా ఎయిర్‌లైన్స్ గుర్తింపు దక్కించుకుంది. పౌరవిమానయాన శాఖ తాజాగా విడుదల చేసిన ఓటీపీ మ్యాట్రిక్స్‌ జాబితాలో ఆకాశా ఎయిర్‌లైన్స్ తొలిస్థానంలో నిలిచింది.

నవంబర్ నెల ఆన్ టైం పర్‌ఫార్మెన్స్ (ఓటీపీ) మ్యాట్రిక్స్ జాబితాలో ఆకాశా ఎయిర్‌లైన్స్ 78.2 శాతం ఓటీపీతో తొలిస్థానంలో నిలిచింది. 77.5 శాతం ఓటీపీతో ఇండిగో రెండుస్థానం దక్కించుకుంది.

ఓటీపీ ర్యాంకులు ఇవీ

  • ఆకాశా ఎయిర్‌లైన్స్ - 78.2 శాతం

  • ఇండిగో - 77.5 శాతం

  • విస్తారా - 72.8 శాతం

  • ఎయిర్ ఇండియా - 62.5 శాతం

  • స్పైస్ జెట్ - 41.8 శాతం

ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సమయపాలన పాటిస్తూ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఎన్ని విమానసర్వీసులు నడిపాయనే అంశం ఆధారంగా ఓటీపీ ర్యాంకింగ్స్‌ను కేటాయిస్తారు. షెడ్యూల్‌లో పేర్కొన్న సమయానికి 15 నిమిషాలకు అటూ ఇటూగా బయలుదేరి, గమ్యస్థానానికి చేరుకునే విమానాలను సమయపాలన పాటించినట్టుగా పరిగణిస్తారు.

తాజా ఓటీపీ మాట్రిక్స్ కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు. హైదరాబాద్ విమానాశ్రయాల్లో వివిధ ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను పరిశీలించి ర్యాంకులు ప్రకటించారు.

Updated Date - Dec 17 , 2023 | 08:53 PM