Jallianwala Bagh Massacre day:జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగి నేటికి 104 ఏళ్లు

ABN , First Publish Date - 2023-04-13T13:43:12+05:30 IST

జలియన్ వాలాబాగ్ ఊచకోత ఉదంతం జరిగి నేటికి 104 ఏళ్లు...

Jallianwala Bagh Massacre day:జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగి నేటికి 104 ఏళ్లు
Jallianwala Bagh Massacre

న్యూఢిల్లీ : జలియన్ వాలాబాగ్ ఊచకోత ఉదంతం జరిగి నేటికి 104 ఏళ్లు... అది 1919వ సంవత్సరం ఏప్రిల్ 13వతేదీ...స్వాతంత్ర్య పోరాట యోధుడు సైఫుద్దీన్ కిచ్లేవ్‌, సత్యపాల్ ను(Saifuddin Kitchlew and Satyapal) బ్రిటిష్ అధికారులు అరెస్టు చేసినందుకు నిరసనగా పంజాబ్ రాష్ట్రం పరిధి అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్(Jallianwala Bagh Massacre day) బహిరంగ ప్రదేశంలో వద్ద స్వాతంత్ర్య సమరయోధులు సమావేశమై శాంతియుతంగా నిరసన తెలిపారు.బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన సైనిక దళాల గుంపు నిరసనకారులను చుట్టుముట్టారు.అంతలో బ్రిటీష్ యాక్టింగ్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేర జలియన్ వాలాబాగ్‌లోని నిరసనకారులపై బ్రిటీష్ సైనికులు కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. ఈ కాల్పుల్లో 370 నుంచి 1,000 మంది మరణించారు.

ఇది కూడా చదవండి : Rozgar Mela: లోక్‌సభ ఎన్నికల లోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు: ప్రధాని నరేంద్రమోదీ

తదనంతర పరిణామాలను డాక్యుమెంట్ చేయడానికి నారాయణ్ వినాయక్ విర్కార్(Narayan Vinayak Virkar) అనే యువ ఫోటోగ్రాఫర్ ముందుకు వచ్చారు. వినాయక్ బుల్లెట్ రంధ్రాల చిత్రాలు తీశారు. బుల్లెట్ రంధ్రాలు కనిపించకుండా తెల్లటి సుద్దతో చుట్టారు.జలియన్‌వాలాబాగ్ ఊచకోతపై నిర్భయ నివేదిక అందించినందుకు బ్రిటీష్ జర్నలిస్టు హార్నిమాన్ బహిష్కరణకు గురయ్యారు. నాటి కాల్పుల ఘటనను స్మరించుకుంటూ ఓ పత్రిక ప్రచురించిన ఊచకోత ఛాయాచిత్రాలను హార్నిమాన్ బ్రిటన్‌లోకి అక్రమంగా రవాణా చేశారు.

Updated Date - 2023-04-13T13:43:12+05:30 IST