రాజ్యసభకు జైశంకర్‌ ఎన్నిక ఏకగ్రీవం

ABN , First Publish Date - 2023-07-18T04:30:02+05:30 IST

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు డెరెక్‌ ఓబ్రియన్‌ సహా 11 మంది రాజ్యసభకు ఏకగ్రీవంగాఎన్నికకానున్నారు. దీంతో అధికార బీజేపీకి ఎగువసభలో మరో సీటు

రాజ్యసభకు జైశంకర్‌ ఎన్నిక ఏకగ్రీవం

న్యూఢిల్లీ, జూలై17: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు డెరెక్‌ ఓబ్రియన్‌ సహా 11 మంది రాజ్యసభకు ఏకగ్రీవంగాఎన్నికకానున్నారు. దీంతో అధికార బీజేపీకి ఎగువసభలో మరో సీటు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 93కి చేరుతుంది. పశ్చిమ బెంగాల్‌ లో 6సీట్లకు, గుజరాత్‌లో 3సీట్లకు, గోవాలో ఒక సీటుకు ఈనెల 24న ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా వీటికి ఒక్కొక్కరే పోటీలో ఉన్నందున ఏకగ్రీవ మయ్యే అవకాశంఏర్పడింది. సోమవారం నామినేషన్ల గడువు ముగిసింది.

Updated Date - 2023-07-18T04:30:02+05:30 IST