Sivaji Wagh nakh: శివాజీ నిజమైన పులిగోళ్లు శివసేనే: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2023-10-01T16:27:44+05:30 IST

ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజమైన పులి గోళ్లు శివసేనేనని ఆ పార్టీ ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. శివాజీ పులిగోళ్లను యూకే మ్యూజియం నుంచి మూడేళ్ల లోన్‌పై స్వదేశానికి తీసుకువస్తున్నారని చెప్పారు.

Sivaji Wagh nakh: శివాజీ నిజమైన పులిగోళ్లు శివసేనే: సంజయ్ రౌత్

ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) నిజమైన పులి గోళ్లు (wagh nakh-Tiger claw) శివసేనేనని ఆ పార్టీ ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. శివాజీ పులిగోళ్లను యూకే మ్యూజియం నుంచి మూడేళ్ల లోన్‌పై స్వదేశానికి తీసుకువస్తున్నారని చెప్పారు. 17వ శాతాబ్దంలో శివాజీ వాడినట్టు చెబుతున్న ఈ ఆయుధాన్ని తీసుకు వచ్చేందుకు మహారాష్ట్ర మంత్రులు ఈనెల 3న లండన్ వెళ్తుండటంపై రౌత్ ఆదివారంనాడు స్పందించారు.


''శివాజీ నిజమైన పులిగోళ్లు శివసేనే. మహారాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన వాఘ్‌ నఖ్‌ను మూడేళ్ల లోన్‌పై తీసుకు వచ్చి ఏంచేస్తారు? మీరు రాష్ట్రాన్ని ఢిల్లీకి గులామ్‌గా చేశారు. ఇంతకంటే అవమానం ఏముంది? '' అని శివసేన చీలకవర్గాన్ని ఉద్దేశించి సంజయ్ రౌత్ అన్నారు. రాష్ట్రం ఎదుర్కొన్న అనేక అవాంతరాలను అధిగమించేందుకు శివసేన పోరాడిందని ఆయన గుర్తుచేశారు. బీజపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్‌ను ఇదే పులిగోళ్లతో ఛత్రపతి శివాజీ హతమార్చినట్టు చరిత్ర చెబుతోంది. లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్‌బర్ట్ మ్యూజియంలో ప్రస్తుతం ఈ ఆయుధం ఉంది.

Updated Date - 2023-10-01T16:27:44+05:30 IST