Share News

ఇజ్రాయెల్‌-హమాస్‌ చర్చలు బంద్‌..!

ABN , First Publish Date - 2023-12-03T02:23:20+05:30 IST

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మరో విడత కాల్పుల విరమణకు చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో.. హమాస్‌ చెరలో ఉన్న బందీలు, ఇజ్రాయెల్‌ జైళ్లలోని పాలస్తీనా ఖైదీల మార్పిడికి బ్రేకులు పడ్డాయి.

ఇజ్రాయెల్‌-హమాస్‌ చర్చలు బంద్‌..!

జెరూసలేం, డిసెంబరు 2: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మరో విడత కాల్పుల విరమణకు చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో.. హమాస్‌ చెరలో ఉన్న బందీలు, ఇజ్రాయెల్‌ జైళ్లలోని పాలస్తీనా ఖైదీల మార్పిడికి బ్రేకులు పడ్డాయి. చర్చల కోసం ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌ శనివారం ఉదయమే ఖతార్‌ రాజధాని దోహాకు చేరుకోగా.. వెనక్కి వచ్చేయాలంటూ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు శుక్రవారం ఉదయంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోగా.. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మళ్లీ దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడులు, షెల్లింగ్‌లో 240 మంది చనిపోగా.. 650 మంది గాయపడ్డట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫలూజా పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో ప్రముఖ పాలస్తీనా శాస్త్రవేత్త సుఫ్యాన్‌ తయేహ్‌, ఆయన కుటుంబం మరణించినట్లు ప్రకటించింది. ఇస్లామిక్‌ యూనివర్శిటీ ఆఫ్‌ గాజాకు అధ్యక్షుడిగా ఉన్న తయేహ్‌ భౌతికశాస్త్రం, అనువర్తిత గణిత శాస్త్రాల్లో ప్రముఖ పరిశోధకుడు. ఇప్పటి వరకు గాజాలో మరణాల సంఖ్య 15,200కు చేరింది.

Updated Date - 2023-12-03T02:23:21+05:30 IST